Sai Dandakam

శ్రీ సాయి నాధుని దండకము
శ్రీ సాయిబాబా | దయా సాంధ్ర | త్రి మూర్త్యాత్మకా | శ్రీ దత్త శివ రామకృష్ణ, మూరుత్యాది దివ్యావ తార స్వరూపా| ఈ ధరిత్రిన్ భక్తులన్ రక్షింపలీలతో దేహమున్ దాల్చినీ పూజలన్. నీ సేవలన్ నీ నామ సంకీర్తన ల్ జొయుభక్తాళి కిన్ భక్త యున్ భుక్తి యున్ ముక్తి యున్ గూర్చి యాపత్తులన్ బాపి, యోగంబు, క్షేసుంబుజే కూర్చి రక్షించు దివ్య స్వభావా | సమస్కార మర్పింతు, లోకంబులో జాతి భేధాలు గల్పించు కొన్నట్టివే గాని సత్యంబుగా లేవువే వంచు భక్తాళికిన్ విశ్వ ప్రేమంబు జాటు చందంబు నన్ ప్రతి గ్రామంబులో విప్రగే హంబులో జన్మమన్ గాంచి బాలుండ వైయుండ, నీ తల్లిదండ్రుల్ ఫకీరొక్కనింగాంచి నిన్నిచ్చ వేయంగయ్యి దేడులాసాధు పోష్యంబులో నుండ యాపిమ్మటన్ వెంకుసా పేరుతో నొప్పు నాదేశ ముఖ్యండు గోపాలరాయుండు, నిన్ చెంతకున్ జేర్చి సద్బోదనల్ జేసి, జ్ఞానో పదేశంబు గావించు, నిన్నంపి వేయంగ నీ సంగతులీ దేశ మందెర్వరున్ గాంచరుండగ సంచారమున్ జేసి, యస్టాద శాబ్దంబులు లోనున్న షిరిడీ యను గ్రామంబునన్ జౌచ్చియచ్చోటనున్నట్టి యావేప వృక్షంబు క్రిందన్ మహా ప్రీతితో నిల్చి, నీవచటన్ క్రింద గూర్చున్న, యాకోమ్మచున్ చాల మాధుర్య యుక్తంబులౌ యాకులంగూర్చియా చెంతనన్ పాడు బడ్డట్టి చోటన్ మసీదొక్కటిన్ గాంచి, యచ్చోటనే సుస్థిరం బైనివాసంబుజేయంగ కాంక్షించి, యద్దానికిన్ ద్వార కామాయి నామంబు గల్పించి, నీ చెంతకున్ కర్మశేషంబుతో జేరు నామానవళి దుఃఖంబులన్ బాపి రక్షించు నీలీలా విశేషంబు లెన్నంగ శక్యం బైనా| యాకాశ భాగంబునన్ పక్షి బృండంబు పై పైకి తాబోవునే గాని యమ్తంబు నుంగాంచగానో పునే | యట్లు నీది వ్యమౌ వైభ వంబులెల్లనే నెన్నంగ నేరీతివీలౌను | ప్రాపంచి కార్దంబులన్ గోరున వ్వారికిన్ గొప్ప ఉద్యోగముల్, ద్రవ్య లాభంబులన్, సత్సంతానమున్, జేకూర్చు చున్, కొందరిన్ సర్వలోకాధ నాధుండ సర్వేశ్వరుడైన యాదేవుని పై భక్తి భావంబు సూచింపుచున్. కొందరిన్ ముక్తి మార్గంబు కాంక్షిచు మర్త్యావళికిన్ బోధంచుచున్, కొందరున్ బ్రోచిపంచ ప్రదేశంబులన్ దెచ్చుకొన్నట్టి భిక్షాన్నమున్ దినుచు, రోజంతయు పుష్కలం బైనట్టి ద్రవ్యంబుతోడన్ మహా వైభలో పేతుడై యుండి సాయంత్రమో వేళకున్. సర్వమున్, సాధలోకాళికిన్ ఖర్చుగావించి పూర్వబురీతిన్ ఫకీరై మదిన్ బేదభావంబు లేకుండగా నందరిన్ జేర్చి, నీ పైన భారంబు సర్వంబునన్ వైచి సద్గురు డంచునిన్ సదానమ్మి సేవించు జీవాళికార్యంబులెల్లన్ సానుకూలాంబుగా దీర్చుచున్ కొంగుబంగార మై వారి రక్షించు సద్బక్త చింతామణీ నేడు నీ దివ్య పాడాబ్జ ముల్ జేరు మమ్మెల్లరన్ గాపాడుతూ, దీనబంధూ, మహాదేవ | దయా సింధు | శ్రీ సాయినాధా | సమస్త నమేస్తే నమః

0