Category Archives: Whatsapp

అర్థం చేసుకోవడమంటే… ఇదే…

పందెం గెలిచిన గుర్రాన్ని అమ్మడానికి వేటగాడు సంతకు వెళ్ళాడు. బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు. గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు. బూట్లిచ్చేమో టోపి తీసుకున్నాడు. ..ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు. టోపి కాస్తా నదిలో పడింది. దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు. అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు. అయ్యోపాపం అని బాధపడ్డారు. “నీకివాల ఉపవాసమే” అన్నాడొకడు. పెళ్ళాంతో బడితపూజ ” తప్పదన్నాడింకోకడు.” నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు “అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు. బాటసారులిరువులు వేటగాడింటికి వెళ్ళారు. వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు. వాడి పెళ్ళాం ఎదురుగా…

Read More »

Brahmana Shakalu – బ్రాహ్మణ శాఖలు

బ్రాహ్మణులలో.. ద్రావిడ, వైదీక, నియోగి, వైష్ణవ, శివార్చక మొదలగు శాఖలు ఉన్నాయి వాటి గురుంచి విపులంగా తెలుసుకుందాం.. ద్రావిడ బ్రాహ్మణ శాఖలు.. 1) ప్రధమ శాఖ ద్రావిడ 2) ద్రావిడ 3) పేరూరు ద్రావిడ 4) పెద్ద ద్రావిడ 5) దిమిలి ద్రావిడ 6) ఆరామ ద్రావిడ 7) పుదూరు ద్రావిడ 8) కోనసీమ ద్రావిడ 9) ద్రావిడ వైష్ణవులు 10) తుమ్మగంటి ద్రావిడ 11) తుమ్మ ద్రావిడ వైదీక బ్రాహ్మణ శాఖలు.. 1) వెలనాటి వైదీక 2) వెలనాట్లు 3) వెలనాటి పూజారులు 4) వెలనాటి అర్చకులు 5)కాసలనాటి వైదీక 6)కాసలనాట్లు 7)ములకినాట్లు 8) ములకినాటి వైదీక 9) తెలగాణ్యులు 10) వేగనాట్లు 11) వేగనాటి వైదీక 12) ప్రధమ శాఖ వైదీక 13) కరణకమ్మ వైదీక నియోగి…

Read More »

హిందూ సంస్కృతిలో పూర్వసువాసిని స్థానం (విధవరాలు)

సహజంగానే స్త్రీలు ఆకర్షణీయంగా కనిపిస్తారు.అసలే అందం గా ఆకర్షణీయంగా కనిపించే స్త్రీలు అలంకరణ చేసుకుంటే మరింత అందంగా కనిపించటం సహజమే కదా?అందులో పెళ్ళైన స్త్రీలు అలంకరణని భర్త కు మరింత అందంగా కనిపించాలనే చేసుకుంటారు.ఇంతవరకు బాగానే ఉంది …కానీ, భర్త చనిపోయిన స్త్రీల సంగతి? నిజానికి విధవ అనే పదం కూడా మధ్య కాలంలో వచ్చినదే.భర్త చనిపోయిన స్త్రీని “పూర్వసువాసిని” అనేవాళ్ళు.ఎల్లప్పుడూ కొండంత అండగా ఉండే భర్త లేనప్పుడు అలంకరణ కొద్దిగా తగ్గించుకోమనే చెప్పారు.వాటిలో భాగంగానే ఉద్రేకాన్ని కలిగించే సుగంధపరిమళ ద్రవ్యాలను తగ్గించమని తదనుగుణంగానే పూర్వసువాసిని అనే పదం వాడేవారు. కానీ,అలంకరణ తగ్గించమన్నారు కదా అని సహజంగా ఆకర్షణీయతను పెంచే… పుట్టుకతోనే హక్కు కలిగిఉన్న కుంకుమ, గాజులు తదితరాలు ఏవేవి అయితే స్త్రీలకు అందాన్నిస్తాయో వాటన్నిటినీ క్రమంగా ఏకంగా నిషేధించటం…

Read More »

నువ్వు బ్రాహ్మణుడివా? బ్రాహ్మణ బంధువువా???

అదేమిటి నేను పుట్టినది బ్రాహ్మణ పుట్టుక కదా నేను బ్రాహ్మణుడినె అని మనం అనవచ్చు. పరమాచార్యుల వారి ప్రకారం బ్రాహ్మణుడు అంటే ఎవరు? పీఠాదిపతుల ఆదేశం ప్రకారం ఎవరు బ్రాహ్మణుడు? అన్నది ఒకసారి చూద్దాం. బ్రాహ్మణ పుట్టుక పుట్టినంత మాత్రాన ఒకడు కర్మత: బ్రాహ్మణుడు అయిపోడు, కేవలం జన్మతః బ్రాహ్మణుడు. పరమాచార్య వారి ప్రకారం నేటి కాలంలో వారినే బ్రాహ్మణుడు అని పిలుస్తున్నాము. బ్రాహ్మణుడు అన్నవాడికి కొన్ని నియమాలు విధింపబడి ఉన్నాయి. అందులో అన్నింటికన్నా విశేషంగా చెప్పబడి ఉన్న విధి సంధ్యావందనం. సంధ్యావందనం చెయ్యని వాడు బ్రాహ్మణుడు అయితే వాడు అత్యధికంగా పాపం మూట కట్టుకుంటున్నాడు. ఒక మూడు తరాల వారు సంధ్యావందనం చెయ్యకపోతే వారిని ఇక బ్రాహ్మణుడు అని పిలవకూడదు. వాడు కేవలం బ్రాహ్మణ బంధువు గా నిలుస్తాడు…

Read More »

నాడు – నేడు

గతంలో సంసారం ‘చీకట్లోనే’ జరిగేది, జీవితాలు వెలుగులో ఉండేవి, నేడు సంసారం వెలుగులోకి వచ్చి జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి, కప్పుకోవాల్సిన వాటిని చూపిస్తూ, చూపించాల్సిన అందమైన ముఖాన్ని కప్పేస్తున్నారు, నాడు కొందరే మందుకు, విందుకు, అలవాటు పడేవారు, నేడు కొందరే వీటికి దూరంగా ఉంటున్నారు, నాడు కష్టమొస్తే, కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పేవారు, నేడు కుటుంబం కుటుంబాలే కష్టాల కడలికి బలోతున్నాయి, నాడు తినడానికి శ్రమించి సంపాదించే వాళ్ళం, నేడు తిన్నది అరగడానికి తిన్నగా శ్రమిస్తున్నాం, నాడు జబ్బు చేస్తే శక్తి కోసం పండ్లు, పాలు తాగేవాళ్ళం, నేడు అదే డబ్బుతో బిళ్ళలు కొని, జబ్బులు ‘కొని’ తెచ్చుకుంటున్నాం, గతంలో అందరూ హార్డవేర్ ఇంజనీర్లే!! అయినా మనసు సాప్ట్ గా ఉండేది, ఇప్పుడు అంతా ‘సాప్ట్ వేర్ ఇంజనీర్లే’ మనసు…

Read More »

నేను చిన్నతనం లో

నేను చిన్నతనం లో …… చేతులు షర్ట్ లోపల ఉంచి, నా ‘చేతులు పోయాయి’అనేవాడిని. 4 రంగుల్లో ఒక పెన్ ఉంటె, అన్ని బటన్స్ ఒకేసారి నొక్కేసేవాడిని ఏంజరుగుతుందో చూసేందుకు. భయపెట్టడానికి తలుపు చాటున నిల్చునే వాడిని, వచ్చేవారు ఎంతకీ రాకపోతే నేను విసుగెత్తి నెమ్మదిగా బయటికొచ్చేవాడిని !! నిద్రపోయినట్టు నటించేవాడిని,అమ్మ నాన్న ఎవరోఒకరు బెడ్ వరకు ఎత్హుకు తీసుకు వెళ్తారు కదా అని . బస్ /రైలులో వెళ్తుంటే , పైనున్న చందమామ మనల్ని follow అవుతున్నదని గుడ్డి నమ్మకం. ఎలక్ట్రికల్ Switch ని ఆన్/ ఆఫ్ కాకుండా మధ్యలో నిలబెట్టే ప్రయత్నం చెయ్యడం. రెండు వర్షపు చినుకులు ఒకదానివెంట ఒకటి కిటికీ కొననుండి జారితే ,అది ఒక పరుగు పందెం అనుకోవడం . నేను చాల జాగర్త…

Read More »

అందగాడివి “శివా”

నువ్వేమీ అందగాడివి కాదు నా కళ్ళకు! ఒంటికి సుగంధ లేపనాలు లేవు పులుముకునే బూడిద తప్ప! కట్టుకోను వస్త్రం లేదు చచ్చిన పులి చర్మం తప్ప! కేశాలకు ఒద్దికలేదు మర్రి ఊడల్ని పోలు జడలు తప్ప! మెడలో నగలే లేవు కఠిన పాషాణాలైన రుద్రాక్ష హారాలు తప్ప! పూమాలల అలంకరణే లేదు నిత్యం మెదిలే కాల సర్పాలు తప్ప! అరమూతలైన ఆ కళ్ళకు తోడు లలాటాన ఆ మూడో నేత్రమొకటి! ఒక చేత త్రిశూలం! మరో చేత కపాలం!! నిత్యం మరణ మృదంగ ధ్వనినాలపించే ఢమరుక ధారుడవై స్మశానాన సంచరించే నువ్వేపాటి అందగాడివి “శివా” నా కళ్ళకు! కానీ నా మనో నేత్రంతో చూస్తే – మా పాపలను భస్మరాసిగ పోసి నీ శరీరనికి లేపనంగా పూసుకుంటూ నీతో చివరికంటూ…

Read More »

Why you need గురువు?

డబ్బు, పేరు, పదవులు ఇవన్నీ అర్థాలు మాత్రమే.. పరమార్థాన్ని చేరుకోవగురువుడమే జీవన గమ్యం.. దానిని చేర్చగలిగేవాడు ‘గురువు’ మాత్రమే అని చెప్పే కధ ఇది. ఓసారి చదవండి. ఓ మహానగరంలో ఓ గురువుగారు తన వద్దకు వచ్చేవారికి ఆధ్మాత్మిక శిక్షణ ఇస్తూ.. ధర్మప్రబోధం చేస్తుండేవారు. మహాసంపన్నుడొకడు ఈ గురువుగారి దగ్గరకు వచ్చి “ అసలు గురువు అవసరమా? గురువు లేకుంటే వచ్చిన నష్టమేమిటి?” అని ప్రశ్నించాడు. గురువుగారు నవ్వుకుని , మీరేం చేస్తుంటారని అడిగారు. నాకు అతిపెద్ద సూపర్ బజార్ ఉంది అని సమాధానమిచ్చాడు సంపన్నుడు. అయితే! ఒకసారి మీ సూపర్ బజార్ కు నన్ను తీసుకువెళ్లండని గురువుగారు అడిగారు. ఇద్దరూ కలిసి సూపర్ బజార్ కు వెళ్లారు. ఆ రోజు సెలవు కావడంతో నిర్మానుష్యంగా ఉంది. ఏడంతస్థుల పెద్ద…

Read More »

Boy?: నానమ్మ నిద్ర రావట్లెదు ఎమైన మాట్లాడుకుందామా……? Baamma : సరె Boy : మన ఇంట్లొ ఎప్పుడు ఐదుగురం వుంటామా….? నువ్వు నెను అమ్మ నాన్న ఇంక చెల్లి మనమెనా ? Baamma : కాదు నాన్న నీకు పెళ్లి అయిందనుకొ అప్పుడు ఆరుగురం ఉంటాం కదా, Boy : మరెమొ చెల్లి పెళ్లి చెస్కుని వెల్లిపొతుందిగా .. అప్పుడు మళ్లీ ఐదుగురం ఉంటాంగా…….?? Baamma ; ఓ నువ్వు అలా వఛ్చావా ….! మరి నీకు పాపొ /బాబొ పుడితె మల్లి ఆరుగురం అవుతాంగా….. Boy :మరి నువ్వు సఛ్చిపొతె మళ్లి ఐదుగురం అవుతాంగా……???? Baamma : ????????నోరు ముసుకుని పడుకొ వెదవా , ఎప్పుడు లొడా లొడా వాగుతా 0

Read More »

భార్య భర్తకు ఫోన్ చేసింది… ఏమండీ తొమ్మిదైంది… ఇంకా ఇల్లు చేరలేదేం…? ఓ ముఖ్యమైన ప్రయోగంలో ఉన్నాం డియర్ అన్నాడు భర్త… ఏమిటదీ అనడిగింది భార్య ఆసక్తిగా, అనుమానంగా…. C2H5OH(విస్కీ) ద్రావణానికి కాస్త H2O(నీరు) , మరికాస్త CO2(సొడా) కలిపాం, దాన్ని ఘనీభవించిన H2O(ఐసు) తో బాగా శీతలీకరించాం, ఇంకా కొన్ని ప్రొటీన్లు రావల్సి ఉంది(మాంసం) , ఈలోపు నికోటిన్ మండిస్తున్నాం(సిగరెట్) డియర్… ఇప్పటికి అయిదారు రౌండ్లు ప్రయోగాలైపోయాయి… అందుకని లేటవుతున్నది అని వివరించాడు భర్త… అందుకేనండీ, మిమ్మల్ని చూస్తే నాకు గర్వం… మా ఆయన బంగారం… 0

Read More »