Svaprakasa kiranaalu – Part 3
సూచిక – ముందుమాట | భాగం – ౧ | భాగం – ౨ | భాగం – ౩* | భాగం – ౪ | భాగం – ౫ జీవాలు చాలా రూపాలలో ఉన్నయి. మానవులు, కోతులు, కుక్కలు, ఆవులు, సింహాలు, కోళ్లు, చీమలు, పురుగులు, పాములు, బల్లులు, చేపలు, పక్షులు మొదలయినవి. అన్నీ ఈ భూమి మీద ఉన్నయి. వీటిలాగే ఉండే వీటి పిల్లలు కూడా ఈ భూమి మీదే ఉంటాయి. “ఉన్నాయి” అన్న పదానికి అర్థం – వాటి శరీరాలు ఈ భూమి మీదే ఉన్నాయి. పుట్టినప్పుడు వాటి శరీరాలు ఈ భూమి ఆవరణలో కనిపించాయి. చనిపోయినప్పుడు వాటి శరీరాలు ఈ భూమి ఆవరణలోనే శుష్కించిపోతున్నయి. పుట్టినప్పుడు ఎక్కడ నుంచో వచ్చి, చచ్చినప్పుడు ఎక్కడికో పోవట్లేదు అని అర్థం అవుతోంది. ఇక్కడే పుట్టి, పెరిగి, జీవించి, చనిపోతున్నాయి. మరి ఏం…