Svaprakasa kiranaalu – Part 4

సూచిక – ముందుమాట | భాగం – ౧ | భాగం – ౨ | భాగం – ౩ | భాగం – ౪* | భాగం – ౫

ఈ మార్పు జరిగే లక్షణం సమస్త పదార్థాల సృష్టికి మూలం. అణువులు కదులుట, పరివర్తనం చెందుట, ప్రతిస్పందించుట. వీటి వల్ల కొత్త పదార్థాలు పుడుతున్నయి. మరికొన్ని ప్రతిస్పందనల వల్ల తన లక్షణం కోల్పోయి ఇంకొక పదార్థం లో కలిసిపోతున్నాయి. అలా తయారయిన జీవులు కూడా ఈ లక్షణాలనే కనబరుస్తాయి. ముఖ్యంగా ఒక ప్రాణి తయారవాలంటే బోలెడన్ని అణువులు కావాలి కదా. కాబట్టి ఉన్న కణాలు పరివర్తనం చెంది ఒకటి రెండుగా, రెండు నాలుగుగా, నాలుగు ఎనిమిదిగా అలా గుణింపబడుతూ పురుష శరీరం లో అభివృద్ధి చెందుతాయి. ఇవి శక్తి కేంద్రాలు అంటే శక్తి వల్ల కదులుతాయి.

ఈ కదిలిన కణాలు శరీరంలో చోటు సరిపోక ఉన్న కణాలు పక్కకు జరిగి, లేదా బయటకు పంపబడి కొత్త కణాలు తయారవుతాయి. ఇలా శక్తి మూలకమైన కణాలు శరీరం నుండి వెళ్ళేడప్పుడు సుఖదుఃఖాలనే  అనుభూతులను కలిగిస్తాయి. ఈ కణాలు అతి వేగంగా ఒక వస్తువుగా తయారవడలో వాటిలో అంతర్భాగంగా ఉన్న శక్తి కారణమవుతుంది. ఈ శక్తి కణాలు స్త్రీ గర్భం యొక్క అండంలో ప్రవేశించి అక్కడ వృద్ధి చెందుతాయి. ఈ కణాలు తము ఏ సమూహం నుంచి విడిపోయాయో వాటి తరహాలోనే ఉంటాయి. అలాంటివి తదనుగుణంగా ఉండే మరొక కణ సమూహంతో కలిసి శరీరం అనే వస్తువు తయారవడానికి కావలసినట్టుగా వివిధ రకాలుగా విడుతూ మళ్ళీ కలుస్తూ మళ్ళీ విడుతూ మాంసము, ఎముకలు, కళ్ళు, చెవులు, కడుపు లాంటివి తయారవుతాయి.

అలా తయారయిన శరీరానికి శక్తి ప్రసరణ కేంద్రాలు పలుచోట్ల ఉంటాయి. ఉదాహరణకు గుండె, మెదడు. ఇవి మనిషికే కాక ప్రాణూలన్నిటికీ ఉంటాయి. ఈ శక్తి ప్రసరణ కేంద్రాల ద్వారా శరీరం బయట ఉన్న ప్రకృతి లో ఉన్న శక్తిని కలిగిన అణువులను ఆహార రూపంలో చేర్చుకుని, తిరిగి కొంత శక్తిని అణువులను ప్రకృతికి ఇస్తుంది.  ప్రకృతి శరీరాలు పరస్పరం శక్తిని ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటాయి.

శరీరం లో శక్తి కేంద్రీకరణ తగ్గగానే తిరిగి శక్తిని పుంజుకోవడానికి ఆహార రూపంలో గానీ ఔషధాల రూపం లో గానీ సహాయం కావాలి. ఇలా జరిగిన తరువాత బలం వచ్చినట్టు అనిపిస్తుంది. వచ్చిన బలంతో ప్రతిస్పందించుట అనే బుద్ధి వల్ల తిరిగి శరీరానికి కావలసిన కణశక్తి ఆహార రూపంలో తీసుకుంటుంది. ఈ శక్తి మోతాదు తగ్గినప్పుడు ముఖ్య శక్తి కేంద్రం అయిన మెదడుసు స్పందించుట అనే లక్షణం తగ్గిపోతుంది. ఇతరులకు ఇది చలనం లేని స్థితిగా అనిపిస్తుంది. తిరిగి స్పృహ పొందలేనంతగా శక్తి క్షయం అయితే  మృత్యువు అని పిలువబడుతుంది.

నిద్ర, స్పృహతప్పుట, మృత్యువు – ఈ మూడింటికీ వ్యత్యాసం ఉంది. నిద్రలో శరీరం తానకు తానుగా శక్తిని వృద్ధి చేసుకోగలదు. అలా కాక బలవంతంగా కానీ, వేరొకరి బుద్ధి చేత నిర్ణయింపబడిన ఔషధం అనే కణ సమూహాన్ని గ్రహించినప్పుడు కానీ శక్తిని వృద్ధి చేసుకుంటే స్పృహ తప్పి తిరిగి స్పృహలోనికి వచ్చుట. ఇక ఎంత చేసినా స్పృహ శక్తిని వృద్ధి చేయడం సాధ్యం కాకపోతే మృత్యువు అనవచ్చు. కాబట్టి మృత్యువు తరువాత తిరిగి ప్రాణ శక్తిని ఉత్తేజితం చేయడం సాధారణంగా సాధ్యపడదు.

మృత్యువు తరువాత శరీరంలో ఉండే కణాలు బయట కణాల ప్రభావం చేత తమ లక్షణాలను మార్చుకుంటాయి. శరీరం ఉబ్బిపోవడం వాటిలో ప్రథమ లక్షణం. తరువాత శక్తి ప్రసరణ తగ్గిపోవడం వల్ల లోపలి కణాలు ఒక దానితో ఒకటి విపరీతంగా ప్రతిక్రియ జరుపుతుంటాయి. శరీరం కుళ్ళడం మొదలవడం ఇక్కడే. ఇలా పరివర్తనం చెందిన కణాలు బయట కణాలతో కలిసిపోతాయి. అందుకే మృత్యువు తరువాత కూడా శరీరంలో సూక్ష్మస్థాయిలో మార్పులు ఉంటాయి. వీటి వల్లే శవ వాసన, కుళ్ళడం, జీర్ణమైపోవడం లాంటివి సంభవిస్తాయి. మృత్యువు తరువాత శరీరం కుళ్ళడానికి సమాయత్తం అయినప్పుడు ముందుగా శరీరంలోని చర్మం నుంచి, రంధ్రములనుండి కణాలు వాటి సహజ తత్త్వం వల్ల గాలొలో కలిసి, గాలిలో ఉండే చలన స్థితి వల్ల పరిసరాలలో వ్యాపిస్తాయి. ఇవి వాటి స్థూల శరీర అవశేషాలను కొన్ని మలిన రూపంలో కలిగి ఉంటాయి. అవి ఇంకొక ప్రాణి ముక్కును చేరి వాసన అనబడే ప్రతిస్పందనగా మారుతూ వేరొక చోటకు చేరుతాయి. మలిన కణాలు నిదానంగా పరివర్తనం చెంది, తమ నిజ రూపం అయిన శక్తి కణాలుగా మారతాయి. మృత్యువు అనేది అణువుల మధ్య జరిగే అదొక రకం క్రియ.

ఇలాంటి స్పందన ప్రతిస్పందన క్రియలు చాలా పదార్థాలలో జరుగుతాయి. వీటికి పట్టే సమయం పదార్థాన్ని బట్టి అందులో ఉండే స్థితిని బట్టి అణువుల కలయిక బంధాన్ని బట్టి మారుతుంటాయి. ఇలాంటి సహజ క్రియ చాలా వేగంగా మార్చగలిగిన స్థితి, శక్తి అగ్నికి ఉంటుంది. అగ్ని త్వరగా కణముల యొక్క స్థితులను మార్చగలదు. రసాయనిక చర్యలు అనబడే అణువుల స్పందన ప్రతిస్పందనలను నియంత్రించగల శక్తి, మార్పు చేయగలిగిన శక్తి అగ్నికి ఉంది. ఈ అగ్ని సరళ భాషలో కేవలం శక్తి ప్రసరణ మూలకం. అగ్నిలో ఉన్న విశేష లక్షణం ఇదే. ఇందులో మిగితా కణములకు కావలసిన శక్తిని ఇవ్వడానికి సాధ్యమవుతుంది. అగ్నివల్ల శక్తి ఉత్తేజితమ్పబడుతుంది. ఆ కణములకు తన శక్తిని నింపి వాటి పరిసరకణములకు తరువాత వాటి పరిసర కణములకు శక్తి ప్రసరణ జరిగి ఊర్జ వ్యాప్తి చేందుతుంది. ఆ కణములు ఊర్జ వలన వాటికి తగిన మార్పును ప్రదర్శిస్తాయి. వేడి, చల్లదనం, వస్తు రూప పదార్థములలో మార్పులు, కణములు కొత్త శక్తి స్పందనలు వ్యక్త పరుచుట శీఘ్రముగా విడుట కలువుట అగ్ని వల్లనే సంభవిస్తున్నాయి. అణు సంఘాతంలో అగ్ని చాలా ముఖ్య పాత్ర నిర్వహిస్తున్నది.

సూచిక – ముందుమాట | భాగం – ౧ | భాగం – ౨ | భాగం – ౩ | భాగం – ౪* | భాగం – ౫

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Uh oh ...