నా ఇలాఖ

ఆది శంకర జయంతి

హిందూ మత పరిరక్షణ కొరకు అవతరించిన సరళ సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం. నేడు ఆది శంకరాచార్యుల జయంతి.

(శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
జగద్గురు ఆది శంకరాచార్య క్రీ.పూ.509 (విభవ నామ సంవత్సరం) శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ,శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు.

ఆయన తన రెండవ ఏటనే రాయడం, చదవడం l గ్రంథాలు చదివేవారు. ఆయన తండ్రి శంకరుల మూడవ ఏటనే చనిపోయారు. ఆయనకు ఐదవ ఏటనే కామ్యోపనయనం చేసారు. ఏడవసంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేసారు.
కారణజన్ములైన శంకరాచార్యులవారు, సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవిందభగవత్పాదా చార్యులవారి చెంత శాస్త్రాధ్యాయనం చేశారు.

ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తుండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను తన ఒడిలోనికి తీసుకుని ఆ పాలను త్రావించి తన కరుణాకటాక్షాలను ఆ చిన్ని శంకరుల మీద ప్రసరింపచేసింది.

ఇంకొకసారి ఆయన వేదాభ్యాస సమయంలో భిక్షకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా, ఆమె తన ఇంటిలో ఉన్న ఒకే ఒక ఉసిరి కాయను ఆయనకు ఇచ్చివేసింది. ఆమె పరిస్థితికి జాలిపడిన శంకరులు సంపదలకు అధినేత అయిన లక్ష్మీదేవిని స్తుతిస్తూ. “ కనకధారా స్తవం ” ఆశువుగా పలికారు. దానికి ఆ తల్లి సంతోషించి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది.

ఆయన సన్న్యాసాశ్రమ స్వీకరణ కూడా విచిత్రంగా జరిగింది. సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది. ఆయన తల్లిని తనను సన్యసించడానికి అనుమతిస్తేనే మొసలి తనను వదిలివేస్తుందని, అనుమతినివ్వమనీ ప్రార్థించారు.తల్లి అనుమతించగానే ఆ మొసలి ఆయనను వదిలివేసింది. ఈ సంసార బంధాలు తనను మొసలిలా పట్టుకున్నాయని, ఆ బంధాల నుండి తనను తప్పించమని ఆయన తల్లిని వేడుకున్నారు. దీనిని అంతరన్యాసం అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తుండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది.
గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ “ప్రాతఃకాలం, రాత్రి, సంధ్యా సమయాల్లో ఏ సమయంలోనైనా, స్పృహలో ఉన్నప్పుడు, స్పృహలో లేనప్పుడు నన్ను తలుచుకోగానే, నీ వద్దకు వస్తాను ” అని శంకరులు తల్లికి మాటిచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారములు చేస్తానని చెప్పి గురువును అన్వేషిస్తూ బయలుదేరారు.
శంకరులు గురువును అన్వేషిస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న శ్రీ గోవిందభగవత్ పాదులను దర్శించి ఆయననే తన గురువుగా భావించి తనను శిష్యుడుగా స్వీకరించమని ప్రార్థించారు. గోవింద భగవత్ పాదులు శంకరులను అనేక పరీక్షలకు గురిచేసి, శంకరుల అద్వైత సిద్దాంతంతో సంతృప్తి చెంది శంకరులను శిష్యునిగా స్వీకరించారు. ఆ తరువాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో కాశీ విశ్వనాధుని దర్శనానికి మరియు వ్యాస మహర్షి దర్శనానికి వారణాసి బయలుదేరారు.
శంకరులలో అంతర్లీనంగా ఉన్న అహాన్ని తొలగించుటకై పరమశివుడు చండాలుని వేషంలో వెంట నాలుగు కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డంగా నిలబడతాడు. అప్పుడు శంకరులు చండాలుని ప్రక్కకు తొలగమని చెప్తారు. అప్పుడా చండాలుని వేషంలో ఉన్న శివుడు ఎవరిని తొలగమంటున్నావు, ఈ శరీరాన్నా, ఈ శరీరంలో ఉన్న ఆత్మనా అని ప్రశ్నిస్తాడు. దానితో శంకరులకు ఆ వచ్చినవాడు పరమశివుడే తప్ప వేరు కాదని గ్రహించి ఆయనను స్తుతిస్తూ మనీషాపంచకం చదివారు. అలా కాశీ విశ్వనాధుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలిగారు శంకరులు.
శంకరులు బ్రహ్మసూత్రాలకు భాష్యమును రచించుటయేగాక, అనేక దేవీదేవతల స్తోత్రములు, ఆధ్యాత్మ సిద్ధాంత గ్రంధాలు రచించారు.
వారు మనకందించిన ఆధ్యాత్మిక సంపద అపారం. అందులో కొన్ని

1 ఈశావాస్యోపనిషత్
2 కేనోపనిషత్
3 కఠోపనిషత్
4 ప్రశ్నోపనిషత్
5 మాండుక్యోపనిషత్
6 తైత్తరీయోపనిషత్
7 చాండుగ్యోపనిషత్
8 బృహదారణ్యకోపనిషత్
9 శ్రీమద్భగవద్గీత
10 శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రము
11 సనత్సుజాతీయం
12 శ్రీ లలితాత్రిశతి
13 హస్తామలకీయము

ప్రకరణ గ్రంథములు

14 వివేకచూడామణి
15 అపరోక్ష-అనుభూతి
16 ఉపదేశసారము
17 ఆత్మబోధ
18 సర్వవేదాంత సంగ్రహము
19 ప్రబోధసుధాకరము
20 అద్వైతానుభూతి
21 ప్రశ్నోత్తరమాలిక
22 బ్రహ్మానుచింతనం
23 సదాచారానుసంధానం
24 స్వరూప అనుసంధానం
25 పంచీకరణం
26 తత్త్వ బోధ
27 ప్రౌఢ అనుభూతి
28 భజగోవిందం
29 శ్రీ గణేశ పంచరత్నం
30 గణేశ భుజంగప్రయాత స్తోత్రం
31 సుబ్రహ్మణ్యభుజంగం
32 శివభుజంగ ప్రయాత స్తోత్రం
33 శివాపరాధక్షమార్పణాస్తోత్రం
34 దేవీభుజంగం
35 భవానీభుజంగం
36 శ్రీరామభుజంగం
37 శారదా భుజంగప్రయాత స్తోత్రం
38 శివానందలహరి
39 సౌందర్యలహరి
40 ఆనందలహరి
41 శివపాదాది కేశాదివర్ణన
42 ఉమామహేశ్వరస్తోత్రం
43 త్రిపురసుందరి మానస పూజ
44 త్రిపురసుందరి అష్టకం
45 దేవీ షష్టి ఉపచార పూజ
46 మంత్ర మాతృకా పుష్పమాల స్తవము
47 కనకధార స్తోత్రము
48 అన్నపూర్ణాష్టకం
49 అర్ధనారీశ్వరస్తోత్రం
50 భ్రమరాంబాష్టకం
51 మీనాక్షీస్తోత్రం
52 నవరత్నమాలికాస్తోత్రము
53 లలితాపంచరత్నము
54 మాయాపంచకం
55 సువర్ణమాలా స్తుతి
56 దశశ్లోకి
57 వేదసార శివస్తోత్రము
58 శివపంచాక్షరీ స్తోత్రం
59 దక్షిణామూర్తి స్తోత్రము
60 దక్షిణామూర్తి స్తవరాజ స్తోత్రం
61.మృత్యుంజయమానసపూజా స్తోత్రము.
62 కాలభైరవాష్టకం
63 షట్పదీస్త్రోత్రం
64 శివపంచాక్షరీనక్షత్రమాలాస్తోత్రము
65 ద్వాదశలింగస్తోత్రము
66 కాశీపంచకం
67 హనుమత్ పంచరత్నం
68 లక్ష్మీనృసింహస్తోత్రం
69 లక్ష్మీనృసింహ కరుణారస స్తోత్రం
70 పాండురంగాష్టకం
71 అచ్యుతాష్టకం
72 శ్రీకృష్ణాష్టకం
73 హరిస్తుతి
74 గోవిందాష్టకం
75 భగవత్ మానస పూజ
76 ప్రాతః స్మరణ స్తోత్రం
77 జగన్నాధాష్టకం
78 గురువాష్టకం
79 నర్మదాష్టకం
80 యమునాష్టకం
81 గంగాష్టకం
82 మాణికర్ణికాష్టకం
83 నిర్గుణమానసపూజ
84 ఏకశ్లోకీ
85 యతి పంచకం
86 జీవన్ముక్తి ఆనందలహరి
87 ధన్యాష్టకం
88 ఉపదేశ (సాధనా ) పంచకం
89 శతశ్లోకీ
90 మనీషాపంచకం
91 అద్వైతపంచరత్నం
92 దేవ్యాపరాధక్షమార్పణస్తోత్రము
93 కాశీసారము
94 కాశీపంచకం
95 గౌరీ దశకం
96 నవరత్న మాలిక
97 కళ్యాణ వ్రిష్టిస్తవము
98 లలితా పంచరత్నం
99 మాయా పంచకం
100 సువర్ణ మాలా స్తుతి
101 దశ శ్లోకి
102 వేద సార శివ స్తోత్రం
103 శివ పంచాక్షర స్తోత్రం
104 శివ అపరాద క్షమాపణ
105 దక్షిణామూర్తి అష్టకం
106 దక్షిణామూర్తి వర్ణమాల
107 మృత్యుంజయ మానస పూజా స్తోత్రం
108 శివ నామావళి అష్టకం
109 కాలభైరవ అష్టకం
110 షట్పదే స్తోత్రం
111 శివ పంచాక్షర నక్షత్ర మాల
112 ద్వాదశ లింగ స్తోత్రం
113 కాశీ పంచకం
114 హనుమత్ పంచరత్నం
115 లక్ష్మీ-నరసిం హ పంచరత్నం
116 లక్ష్మీ-నరసిం హ కరుణారస స్తోత్రం
117 పాండురంగ అష్టకం
118 అచ్యుత అష్టకం
119 శ్రీ కృష్ణ అష్టకం
120 హరి స్తుతి
121 గొవింద అష్టకం
122 భగవత్ మనస పూజ
123 ప్రాత: స్మరణ స్తొత్రం
124 జగన్నాథ అష్టకం
125 గురువాష్టకం
126 నర్మదాష్టకం
127 యమునా అష్టకం
128 గంగా అష్టకం
129 మణికర్ణిక అష్టకం
130 నిర్గుణ మానస పూజ
131 ఏక శ్లోకి
132 యతి పంచకం
133 జీవన ముక్త ఆనంద లహరి
134 ధన్య అష్టకం
135 ఉపదేశ(సాదన)పంచకం
136 శత శ్లోకి
137 మనీషా పంచకం
138 అద్వైత పంచరత్నం
139 నిర్వాణ శతకం
140 దైవ్యపరాధ క్షమాపణ

శంకరులు రచించిన రచనలలో సౌందర్యలహరి, శివానందలహరి, భజగోవిందం చాలా ప్రాముఖ్యమైనవి.
ఈయన సన్న్యాసాశ్రమ నియమాలని ప్రక్కన పెట్టి మరీ తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు అంత్యేష్టి కార్యక్రమములను నిర్వర్తించారు. ఆ విధంగా తల్లి అత్యంత పూజనీయురాలని, తల్లికి సేవ చెయ్యడం పిల్లల కర్తవ్యమని, దానికి ఎటువంటి నియమాలు అడ్డురావని లోకానికి చాటి చెప్పారు. తల్లికిచ్చిన మాట కోసం తల్లి అవసానదశలో
“శ్రీ కృష్ణ పరమాత్ముని దివ్య లీలలు” తల్లికి చూపించి సంతోషపరిచారు. ఆనాటి కట్టుబాటులను ఎదిరించి తాను సన్యాసి అయినా కన్నతల్లి అంత్యేష్ఠిని స్వయంగా నిర్వహించారు

జయ జయ శంకర హరహర శంకర

 

Exit mobile version