నా ఇలాఖ

Remembering her – 1

వినవా నా మాటలని
వినవా నేచెప్పాలనుకున్నది.

చిరుగాలి నిన్ను చేరి నా ప్రేమను చెప్పాలనుకుంటోంది
కనిపించని గాలిలో కనిపించే నా ప్రేమని చూడు.

నిన్ను తాకిన గాలిని చీదరించకు
అది నా స్పర్శని నీకు తెలియజేయాలనుకుంటోంది.

నిన్ను పలకరించే పూలని చూడు
నా ప్రేమలోని అందాన్ని ఆనందాన్ని చూడు.

నేను చెప్పే మాటలని విను
ప్రతి అక్షరంలోని ఆప్యాతని చూడు.

నేను విసిగిన క్షణాలని చూడు
ఆత్మీయంగా తీసుకున్న చొరవని చూడు.

విరిసిన చిన్న పువ్వులని చూడు
అవి నా మనస్సులోని నీ ఆలోచనలని గుర్తించు.

రాత్రి ఒంటరిగా ఉన్నానని చింతించకు
వెన్నెలగా నిన్ను పలకరిస్తుంటాను
కొన్ని సార్లు కనిపించనని అనుకోకు
తారల కాంతిలో నీ వెనకే ఉంటాను

ఓ గాలీ, నాకు నా మనసుకి మధ్య ఉన్న నువ్వు
నా చెలిని నాకిచ్చి కలిగించవా ఓ చిరు నవ్వు

ఆకాశంలోని పక్షుల్లా ఎగిరే నా మనసుకు
కల్పించవా నా చెలి మనసులో ఓ వెచ్చని గూడు

పంజరంలో ఉన్న నా మనసుకి రెక్కలు వచ్చి
ఎగరాలని ఉంది నా చెలి చెంతకు
చెప్పాలని ఉంది ఎన్నో ఊసులని
వినాలనుంది ఆమె మధుర స్వరాన్ని

గుర్తుకొచ్చిన క్షణాలను తిరిగి తీసుకురాలేని కాలమా
కల్పించవా నా చెలితొ ఉండే అవకాశం ఆజన్మాంతం.

పట్టిన కలం విడువక వ్రాస్తున్న ఈ భావాల్లోని ఆంతర్యాన్ని
నమ్మిన చెలిని వదులుకుంటానెమోనని భయపడే నా మనసుని
మనసులోని భావాలకి అక్షర రూపం కల్పిస్తూ
ఆ అక్షరమాలికని నా చెలి కురులకు కానుకగా ఇవ్వాలి

నా చెలికి చెప్పాలనుకున్న విషయాలను చూస్తున్న ఓ కాంతులారా
నేను చెప్పాలనుకున్న ఊసులను మీరైనా చెప్పరా..

ఎన్నో రోజుల ఎడబాటు తర్వాత పృథ్విని
పులకరింపజేసే వర్షపు చినుకుల్లారా
నా చెలి చెప్పలేని మౌనగీతాలని చెప్పి
నా మదిలో పరిపళించే గంధాన్ని నా చెలికందజేయరా.

నిన్ను నేనుగా చూడలేని జీవితంలో
నన్ను నిన్నుగా చూడమని చెప్పే నా మనసు
నిన్ను నన్నుగా మార్చవద్దని శాసిస్తూ
నేను చూసిన నిన్ను నాకందజేయమని అర్థిస్తోంది.

ఒంటరితనంలో విసిగిన నా జీవితంలో
నువ్వు తోడు నీడై ఉండాలని కోరుకుంటూ
నా కవి హృదయం చెప్పే మాటలని
హారంగా చేసి నీ మెడలో వేస్తున్నా

నువ్వులేని జీవితం ఊహించడానికే భయపడే నా మనసు
నీ ముందు చెప్పాలనుకున్న ఊసులని చెప్పలేదేమో మరి..
చెప్పకనే చెప్పే నా కళ్ళలోని ప్రేమని
కనులతోనే గమనించవా మరి.

సముద్రంలోని నీరు తీరానికి తన ప్రేమని చెప్పాలనుకుంటూ
అలల రూపంలో నిరంతరం ఆప్యాయంగా స్పృశించి పొందే
అనుభూతిని తను కూడా అనుభవించాలంటూ
ఉవ్విళ్ళూరే నా మనసుకు సమాధానమేమిటో..

నిరంతరం నీ ప్రెమను అనుభవిస్తున్న నాకు
చెప్పాలని ఉవ్విళ్ళూరే మనసుకు
చివరికి మిగిలేది గెలుపో ఓటమో..

చలిగా ఉన్న క్షణాలలో
నీ ఆలోచనల వెచ్చదనంలో
చలి కాచుకుంటున్నాను

(కంప్యూటర్ వాణ్ణి కదా అందుకే.. )

నా కంప్యూటర్లో ప్రాసెసర్ ఒంటరిగా ఔట్‍పుట్‍ని కూడా కంట్రోల్ చేస్తోంది
గ్రాఫిక్స్ కార్డ్ గా నేను చేసే పని పంచుకుని నా జత కావా.. 🙂

———————-
English translation for some verses:

listen to my words.. listen to what i want to say..
the air is reaching u to show my love on you.
in the invisible air, try to see the love that i have on you
look at the flowers.. and try to see the beauty of my love in their fragrances.
oh air, u are between me and my beloved. so give me the pleasure by presenting her to me
my heart is flying like a bird in the sky, searching for the nest in the heart of my beloved
oh time, u cannot bring back the memorable moments i had with her. but u can give me some more moments by making me live with her till the end of my life.
i am phrasing the feelings in my heart, and let this garland of words decorate her hair.
like the fragrance which is spilled by earth when the first rain falls, let her feel the fragrance of my heart.
my heart is scared with the thought that it cannot live without u, so it is not able to express my love completely. so see the love i have through my eyes, as the waves in the ocean are touching the shore to express the love, my heart touching u with its words.
when i feel shivering cold, i get the warmth with the thoughts of u and the moments i had with you.

Exit mobile version