తేదీ : 23 – 12 – 2016

గోడ మీద వార్తలు –

01. వంగవీటి తెలుగులో తన ఆఖరి చిత్రమని మరోసారి ప్రకటించిన – రాంగోపాల్ వర్మ…
బొంగేం కాదూ – పేక్షక పెజానీకాల ముఖాన అంత అదృష్టం యాడ రాసుందిలే…!!

02. నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య దృష్ట్యా పార్కింగ్ స్థలం ఉన్నవారే కారు కొనుక్కోవాలనే రూలు తెచ్చే ఆలోచనలో – కేంద్ర ప్రభుత్వం…
ఎన్నేళ్ళకెన్నేళ్ళకి ఎలిగిందిరా సామీ – కరెంటు షాకులు గానీ ఉచ్చుకున్నారా ఏంది – మెదడు పాదరసంలా పరిగెడతంది…!!

03. దగ్గరలో ఉన్న పబ్లిక్ టాయెలెట్ లను గుర్తించేందుకు గానూ గూగుల్ టాయిలెట్ లొకేటర్ యాప్ ని లాంచ్ చేసిన – కేంద్రం
పొరపాటున నెట్ కనెక్ట్ కాపోతే – తగిలే వరకూ ఉగ్గబట్టుకుని సావాలేమో …!!

04. ప్రజా ప్రతినిధులంతా వారంలో ఓ రోజు చేనేత వస్త్రాలని ధరించి చేనేతకి మద్దతు తెలపాలి – కేటీఆర్…
నీ నోట్లో బెల్లం ముక్కెట్ట – ఆ నోటితోనే ప్రభుత్వ – ప్రైవేటు ఉద్యోగులు కూడా… అని ఓ రూలు పాస్ చేసి పారేయ్ సామీ…!!

05. శీతాకాల విడిది కోసం నగరానికి విచ్చేసిన రాష్ట్రపతికి స్వాగతం పలికి పాదాభివందనం చేసిన – కేసీఆర్…
సూత్తంటే స్టేటుని మరో తమిళనాడులా తయారు చేసేట్టున్నారే …!!

06. నాలుగేళ్ళ చిన్నారిని అత్యాచారం చేసి చంపేసిన నిందితుడికి మరణ శిక్ష విధించిన – కరీంనగర్ కోర్టు…
జడ్జి గారికి – కోర్టు సిబ్బందికీ శాలువాలు కప్పి సన్మానించుకని- దండేసి దండమెట్టాల …!!

07. మోడీ అవినీతి ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖాధికారులు ఎందుకు ప్రశ్నించటం లేదు – కేజ్రీవాల్…
పడుకున్న గుర్రాన్నెవడన్నా లేపి తన్నించుకుంటాడ్రా – పిఛ్చ కాపోతే…!!

08. ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన నజీబ్ జంగ్ – తిరిగి ఉపాధ్యాయ వృత్తిలోకి వెళతానని ప్రకటన..
సీయమ్ము – పీయమ్ముల మధ్య మద్దెల బతుకు కన్నా అదే బెటరని ఫిక్షైయుంటాడు పాపం…!!

09. హైదరాబాద్ లో అతి పెద్ద షోరూం ని ఓపెన్ చేసిన వాచీల తయారీ కంపెనీ – టైటన్…
జనాల టైం బాలేని టైంలో – వాచీల షాపు ఓపెన్ చేయాలని ఎట్టా అనిపించిందిరా సామీ…!!

10. నేడు కిర్లంపూడి వెళ్ళి ముద్రగడని కలవనున్న – వైకాపా నేత భూమన…
త్వరలో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరనున్న వైకాపా ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన…!!

మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!! @ నా………

“ తెలుగు వారందరం తెలుగు లోనే మాట్లాడుకుందాం ”

:||: జై హింద్ :||:

error: Uh oh ...