హిందూ సంస్కృతిలో పూర్వసువాసిని స్థానం (విధవరాలు)

సహజంగానే స్త్రీలు ఆకర్షణీయంగా కనిపిస్తారు.అసలే అందం గా ఆకర్షణీయంగా కనిపించే స్త్రీలు అలంకరణ చేసుకుంటే మరింత అందంగా కనిపించటం సహజమే కదా?అందులో పెళ్ళైన స్త్రీలు అలంకరణని భర్త కు మరింత అందంగా కనిపించాలనే చేసుకుంటారు.ఇంతవరకు బాగానే ఉంది …కానీ, భర్త చనిపోయిన స్త్రీల సంగతి?

నిజానికి విధవ అనే పదం కూడా మధ్య కాలంలో వచ్చినదే.భర్త చనిపోయిన స్త్రీని “పూర్వసువాసిని” అనేవాళ్ళు.ఎల్లప్పుడూ కొండంత అండగా ఉండే భర్త లేనప్పుడు అలంకరణ కొద్దిగా తగ్గించుకోమనే చెప్పారు.వాటిలో భాగంగానే ఉద్రేకాన్ని కలిగించే సుగంధపరిమళ ద్రవ్యాలను తగ్గించమని తదనుగుణంగానే పూర్వసువాసిని అనే పదం వాడేవారు. కానీ,అలంకరణ తగ్గించమన్నారు కదా అని సహజంగా ఆకర్షణీయతను పెంచే… పుట్టుకతోనే హక్కు కలిగిఉన్న కుంకుమ, గాజులు తదితరాలు ఏవేవి అయితే స్త్రీలకు అందాన్నిస్తాయో వాటన్నిటినీ క్రమంగా ఏకంగా నిషేధించటం జరిగింది.

ఏ ఆచారమైనా దేశ కాలమాన పరిస్థితుల ఆధారంగానే మొదలౌతుంది.కన్యాశుల్కంలోని గిరీశం లాంటి సన్నాసుల బారిన పడితే వాళ్ళ జీవితం అధోగతి అవుతుందని కొన్ని నియమాలను విధించుకుంది ఆనాటి సంఘం.అనాథలైన పిల్లలను చేరదీసి వారాలు చేసుకుని బతికేలా చేయూత ఇవ్వగలిగేవారు కానీ, ఇప్పటి ప్రభుత్వాలలా అక్రమ సంతానాన్ని పెంచి పోషించే బాధ్యత ఏ ఒక్కరూ తీసుకునే వారు కాదు.
చివరికి సంఘ కట్టుబాట్ల వల్ల వచ్చిన అలంకరణలోని మార్పు దురాచారంగా పరిణమించింది.

కృష్ణ నిర్యాణం తరువాత అర్జునుడు కృష్ణుడి ఆదేశం మేరకు అతని భార్యలను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఉంది కాని వాళ్ళని విధవలను చేయటం అనేది ఎక్కడా మనకు కనిపించదు.శివుని మూడో కంటికి బూడిద అయిన మన్మధుని భార్య రతీదేవి పార్వతిని శపించినా ఆమెను ఎక్కడా విధవను చేయటం మనకు కనిపించదు. మన్మథుడు మనసిజుడు అంటారు. మరణించిన భర్త భార్య మనసులో ఎల్లప్పుడూ జీవించే కదా ఉంటాడు.
ప్రథానమైన 7గురు గ్రామదేవతల్లో ఒక దేవత వితంతువే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో…

భర్త చనిపోయినా 28 సంవత్సరాల పాటు లెఖ్ఖ పెట్టలేనన్ని ధార్మిక, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి పరిపాలించిన 18వ శతాబ్ధపు మహారాణి “అహల్యాబాయి హోల్కర్” వితంతువే.

భర్త విగత జీవుడైనా రాజమాతగా గౌరవ మన్ననలను అందుకునేది పూర్వకాలంలో స్త్రీ.
మహాభారతంలో సత్యవతి పాండురాజు సింహాసనాన్ని అధిష్టించే వరకూ కురు సామ్రాజ్యాన్ని రాజమాతగా పరిపాలించింది.
ఎదురు పడకూడదు లాంటి ఆంక్షలు ఆ కాలంలో లేవు కూడా .. ఏ పుట్టలో ఏ పాము ఉందో ?? ఏ మగవాడి మనసులో ఏ దురుద్దేశం దాగి ఉందో ??? తెలియదు గనుక ఆమె రక్షణ కోసం కాలానుగుణంగా చెప్పిన మాటలు అవి.

వితంతువు ఐన “రాణి లక్ష్మీ బాయి” నుంచి దిక్కుమాలిన రూల్స్ పెట్టి ఆమె ను కిరాతకంగా వెన్నుపోటు పొడిచి హత్య చేసింది నాటి ‘కిరస్తానీ’ బ్రిటిష్ గాళ్ళే..
ఇలాంటి నీచాతినీచమైన , దిక్కుమాలిన రాజకీయాల్లో దిట్టలు వాళ్ళే కదా!!

చాలామందికి ఉత్తరాలలో ఇది వినేవుంటారు. సువాసినులను ఒకరి భార్యగా ‘శ్రీమతి’ అని సంభోదిస్తే, వితంతువులను ‘గంగా భాగీరధీ సమానురాలైన ‘ అని సంబోధన ఉంటుంది.

విధవను శ్రీమతి అనరు. సౌభాగ్యవతి అనరు. మహాలక్ష్మి సమానురాలని కూడా అనరు. విధవను ‘గంగాభాగీరధీ సమానురాల’నే వ్యవహరిస్తారు. గంగ విధవ కాదే?
విధవరాలు గంగతో సమానురాలు ఎలా అవుతుంది??
గంగ పవిత్రతకి ప్రతీక ఐతే, విధవ అశుభానికి సంకేతం అంటారు కదా…
విధవను గంగను సమానులుగా సరిపోల్చే ఈ సాంప్రదాయం ఎలా వాడుకలోకి వచ్చింది??
భర్తను పోగొట్టుకొని అనాథ అయిన స్త్రీ పట్ల అందరూ పూర్వం కంటే మరింత పవిత్రతా భావంతో ప్రవర్తించాలన్న ఉద్దేశంతో మన పూర్వజులు విధవను గంగమ్మ తల్లితో సరిపోల్చారు.
ఇక్కడ విధవ గంగతో సరిపోల్చబడింది కాని గంగను విధవతో సరిపోల్చినట్టు కాదు. భర్త చనిపోయాక మగదక్షత లేని విధవకు సామాజిక రక్షణ కలిగించే సదుద్దేశ్యంతో ఆమెకు గంగతో సమానమైన పవిత్ర స్థానాన్ని ఆపాదించారు పూర్వీకులు.

ఈ విషయంపై వేరొక కథనం కూడా ఉంది. “గంగ” అంటే ‘భాగీరధీ” అన్న అర్ధమే గాక గంగా శబ్దాన్ని విశేషణంగా తీసుకుంటే “పూజ్యమైన” అన్న అర్ధం ఉంది. విధవ గంగా భాగీరధీ నదులంతటి పునీతమైనదన్న భావంతో విధవను గంగా భాగీరధీ సమానురాలని పూజ్యభావంతో వ్యవహరించడం అనూచానంగా వస్తున్న ఆచారం.

ఇంకో చమత్కారమైన కథనం కూడా ప్రచారంలో ఉంది.
“గంగ” అంటే నీరు కదా! నిలువెల్లా నీరే అయిన గంగమ్మ పుణ్యస్త్రీ అయినా బొట్టు పెట్టుకోవడానికి ఆమెకు అవకాశం లేదు. ఆపాదమస్తకం శరీరమే నీరయినప్పుడు నీటిలో బొట్టు నిలిచేది ఎలా?? సృష్టిలో బొట్టు పెట్టుకో(లే)ని ఏకైక సుమంగళి గంగమ్మ తల్లి ఒక్కర్తే!
భర్త ఉండీ పునిస్త్రీ అయినది గంగమ్మ , భర్తని పోగొట్టుకుని బొట్టు పెట్టుకునే సౌభాగ్యాన్ని పోగొట్టుకుంది విధవ.

“బొట్టు” అంటే నుదుటను పెట్తుకునే “తిలకం” అనే కాదు. “పుస్తె,తాళిబొట్టు” అన్న అర్ధాలు కూడా ఉన్నాయి. బొట్టుకి, తాళిబొట్టుకి అంతటి అవినాభావ సంబంధం ఉంది. బొట్టు విషయంలో బొట్టు(తాళి) ఉన్న గంగకూ విధవకూ సామ్యమున్నది!
అందుకనే విధవను గంగా భాగీరధీ సమనురాలనడంలో ఔచిత్యం అర్ధం అవుతున్నది కదా!

అంటే, భర్త తో వచ్చిన తాళిబొట్టు , నల్లపూసలు, మట్టెలు లాంటివే తీస్తారు. కానీ, పుట్టుక నుంచి వచ్చినవి కాదు..పైగా అలాంటి వాళ్ళకి మనసులో భర్త గురించి బాధతో కూడిన జ్ఞాపకాలు ఆమెను కృశింపజేయనీకుండా చాలా విపరీతమైన ఇంటి పని అప్పజెప్పటం వల్ల కూడా బొట్టు పెట్టుకోవటానికి కూడా సమయం ఉండేది కాదు.

దంపతుల లో ముందుగా భార్య చనిపోతే భర్త కూడా ఏ కార్యాలకూ పనికిరాడు. చివరకు పెళ్ళానికి కర్మ కాండలకు కూడా… ( కొడుకు ఉంటే)

నిజానికి హిందూ ధర్మం పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ అధికారాలు ఇచ్చింది.

చాలామంది బ్రాహ్మణుల ఇళ్లల్లో భర్త చనిపోతే భార్యను విధవరాలును చేసే కార్యక్రమం మానేసి కొన్ని దశాబ్దాలు అయ్యింది. ఈ దురాచార తంతు ఊసే ఎత్తకుండా ఆమె పిల్లలు ( పిల్లలు అంటే..
కూతుళ్లు,కొడుకులు అని మాత్రమే కాదు కోడళ్ళు కూడా) తల్లికి ఆసరాగా,
ధ్రుఢమైన గోడగా నిలబడుతున్నారు.

తర్కం విజ్ఞత కలిగిందే ఆచారం..
ప్రవహించే నది లాంటి కాలంతో కలసి అడుగులు వేయకుండా మూర్ఖంగా పాటించే విధానమే దురాచారం.
దేశకాలమాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించటం అన్నివిధాలా శ్రేయస్కరం…

~ Radha Krishna

error: Uh oh ...