రుద్రాక్ష

*నక్షత్రము ధరించవలసిన రుద్రాక్ష*

అశ్వని – నవముఖి
భరణి – షణ్ముఖి
కృత్తిక – ఏకముఖి, ద్వాదశముఖి
రోహిణి – ద్విముఖి
మృగశిర – త్రిముఖి
ఆరుద్ర – అష్టముఖి
పునర్వసు – పంచముఖి
పుష్యమి – సప్తముఖి
ఆశ్లేష – చతుర్ముఖి
మఖ – నవముఖి
పుబ్బ – షణ్ముఖి
ఉత్తర – ఏకముఖి, ద్వాదశముఖి
హస్త – ద్విముఖి
చిత్త – త్రిముఖి
స్వాతి – అష్టముఖి
విశాఖ – పంచముఖి
అనురాధ – సప్తముఖి
జ్యేష్ఠ – చతుర్ముఖి
మూల – నవముఖి
పూర్వాషాఢ – షణ్ముఖి
ఉత్తరాషాఢ – ఏకముఖి లేదా ద్వాదశముఖి
శ్రవణం – ద్విముఖి
ధనిష్ట – త్రిముఖి
శతభిషం – అష్టముఖి
పూర్వాభాద్ర – పంచముఖి
ఉత్తరాభాద్ర – సప్తముఖి
రేవతి – చతుర్ముఖి.
నవరత్నముల కు బదులు రుద్రాక్షలు కూడా ధరించవచ్చు.

1) కెంపు – ఏకముఖి, ద్వాదశముఖి

2) ముత్యం – ద్విముఖి, ఏకాదశ ముఖి

3) పగడం – త్రిముఖి, అష్టాదశ ముఖి

4) పచ్చ – చతుర్ముఖి, త్రయోదశ ముఖి

5) పుష్యరాగం – పంచ ముఖి, చతుర్దశ ముఖి

6) వజ్రం – షణ్ముఖి, పంచ దశ ముఖి

7) నీలం – సప్త ముఖి, షోడశ ముఖి

8.)గోమేధికం – అష్టముఖి, గౌరీ శంకర ముఖి

9) వైఢూర్యం – నవ ముఖి, ఆష్టా దశ ముఖి.

రుద్రాక్షలు ధరించడం వల్ల వచ్చు ఫలితములు

1) ఏకముఖి రుద్రాక్ష – ఈ రుద్రాక్ష చాలా విలువైనది. ఎటువంటి మంత్ర తంత్ర ప్రయోగాలు అయినా తిప్పి కొట్టగలదు. సిరి సంపదలు, శిరో సంబంధ రోగములు నివారణ అగును.

2) ద్విముఖి – ఇది బ్రహ్మ రుద్రాక్ష అని కొందరి అభిప్రాయం. అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక అని కూడా అనుకోవచ్చు. సంతాన ప్రాప్తి, ఏకాగ్రత, వ్యాపార అభివృద్ధి. కల్గును. మనోవ్యాకులతను దూరం చేస్తుంది

3) త్రిముఖి – ఈ రుద్రాక్ష చాలా అదృష్టదాయకమయినది. ధనధాన్యసమృద్ధి, కామెర్ల వ్యాధి నివారణ మరియు సర్ప దోష నివారణ అగును.

4) చతుర్ముఖి – పరిశోధకులు, జ్యోతిర్గణిత వేత్తలు ధరించడం వల్ల అదికరాణింపు ఉండును మరియు ఏకాగ్రత పెరుగును.

5) పంచముఖి – బ్రహ్మ స్వరూపమయిన ఈ రుద్రాక్ష వల్ల అకాలమృత్యునివారణ, గుండెపోటు వంటి హృద్రోగ సంబంధిత వ్యాధులు నివారణ అగును మరియు మలబద్దకం నివారణ అగును.

6) షణ్ముఖి – ఈ రుద్రాక్ష కుమార స్వామి స్వరూపం, శక్తి, విజయం, శరీర ధారుఢ్యం, ఆరోగ్యం లభించును.

7) సప్త ముఖి– సభావశ్యత,సంపద, కీర్తి, ఉత్తేజం కల్గును.

8.)అష్ట ముఖి – ఆకస్మిక ధన ప్రాప్తి కల్గును.

9) నవముఖి రుద్రాక్ష – ఈ రుద్రాక్ష భైరవ స్వరూపమయినది. రాజకీయ పదవులలో ఔన్నత్యం ఆశించువారికి, అపమృత్యు నివారణకు, పరోపకార దక్షులకు ధరించవచ్చు.

10) దశముఖి రుద్రాక్ష – విష్ణు స్వరూపమయినది. గొంతు సంబంధ రోగాలను, నవగ్రహముల ద్వారా కలుగు కష్టములు, సమస్యలు నివారణ అగును.

11) ఏకాదశ ముఖి – ఇది శివాత్మకమయిన రుద్రాక్ష. వైవాహిక జీవితం లోఆనందమునకు, గర్భ సంభందరోగాలకు అనుకూలత లభించును.

ఇలా ఏకవింశతి ముఖ రుద్రాక్షలు అన్నియు అనేక విధముల సత్ఫలితములు కల్గును.(తప్పని సరిగా నియమ,నిభందనలు పాటించవలయును)

error: Uh oh ...