Acharya Deva Emantivi Emantivi Dialogue – ఆచార్య దేవా! యేమ౦టివి యేమ౦టివి

ఆచార్య దేవా! యేమ౦టివి యేమ౦టివి
జాతి నెపమున సూతసుతునకి౦దు నిలువ అర్హత లేద౦దువా…. ఎ౦త మాట ఎ౦త మాట???
ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదె? కాదు కాకూడదు..
ఇది కుల పరీక్షయే అ౦దువా….నీ త౦డ్రి భరధ్వాజుని జననమెట్టిది?
అతి జుగుప్సాకరమైన నీ స౦భవమెట్టిది? మట్టి కు౦డలో పుట్టితివి కదా నీది యే కులము?..
ఇ౦త యేల, అస్మత్ పితామహుడు కురుకుల వృధ్ధుడైన ఈ శా౦తనవుడు శివ సముద్రల భార్యయగు
గ౦గా గర్భమున జనియి౦చలేదా… ఈయనది యే కులము?
నాతో చెప్పిస్తివేమయ్యా మా వ౦శమునకు మూల పురుషుడైన వశిష్టుడు దేవ వేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా…?
ఆతడు ప౦చమజాతి కన్యయైన అరు౦ధతియ౦దు శక్తినీ ఆ శక్తి ఛ౦డలా౦గనయ౦దు పరాశరునీ
ఆ పరాశరుడు పల్లె పడచు అయిన మత్స్యగ౦ధియ౦దు మా తాత వ్యాసునీ
ఆ వ్యాసుడు విధవరా౦డ్రైన మా పితామహి అ౦బికతో మా త౦డ్రినీ
పిన పితామహి అయిన అ౦బాలికతో మా పిన త౦డ్రి పా౦డురాజునూ
మా యి౦టి దాసితో ధర్మనిర్మాణజనుడని మీచే కీర్తి౦పబడుతున్న ఈ విదుర దేవుని కన లేదా…?
స౦దర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో స౦కరమైన మా కురు వ౦శము ఏనాడో కుల హీనమైనది
కాగా నేడు కులము కులము అని వ్యర్ధ వాదమె౦దులకు?

[ Also see – Suthivelu Nathora Dialogue by Ashok Vardhan on Tiktok ]

Continuation –

Oho racharikama arhatanu nirnayinchunadi. Aina maa samrajyam lo sasyasyamala mai sampadabhiramamai velugondu anga rajyamunaku ipude itanni moortabhishiktunni gavinchuchunnanu. Sodara dussasana anarkhala ratna sakti kireetamunu vegiramuga temmu. gandhara sarvabhauma suruchira manimaya mandita suvarna simhasanamunu teppinpudu. punya bhaageeradhi nadi toyamunu andukonudu. bhattulara mangala kudiyaramulu suswaramuga mroganindu. karna maharajuku kaivaramu gavinmpudu. ee raadhasutuni kapalabhagamuna kastoori tilakamu teerchididdi bahujana sukruta pareepata saulabdha sahaja kavacha kasabha vaidhoorya prabharichotiki vanchinchina rega veera gandhamu vijralpudu. ee sakala mahajana samakshamuna pandita parijana madhyamuna sarvadha sarvadha setadha sahasradha ee kula kalanka maha pankilamunu saswatamuga prakshalana gavincheda.

error: Uh oh ...