అందగాడివి “శివా”

నువ్వేమీ అందగాడివి కాదు నా కళ్ళకు! ఒంటికి సుగంధ లేపనాలు లేవు పులుముకునే బూడిద తప్ప! కట్టుకోను వస్త్రం లేదు చచ్చిన పులి చర్మం తప్ప! కేశాలకు ఒద్దికలేదు మర్రి ఊడల్ని పోలు జడలు తప్ప! మెడలో నగలే లేవు కఠిన పాషాణాలైన రుద్రాక్ష హారాలు తప్ప! పూమాలల అలంకరణే లేదు నిత్యం మెదిలే కాల సర్పాలు తప్ప! అరమూతలైన ఆ కళ్ళకు తోడు లలాటాన ఆ మూడో నేత్రమొకటి! ఒక చేత త్రిశూలం! మరో చేత కపాలం!! నిత్యం మరణ మృదంగ ధ్వనినాలపించే ఢమరుక ధారుడవై స్మశానాన సంచరించే నువ్వేపాటి అందగాడివి “శివా” నా కళ్ళకు! కానీ నా మనో నేత్రంతో చూస్తే – మా పాపలను భస్మరాసిగ పోసి నీ శరీరనికి లేపనంగా పూసుకుంటూ నీతో చివరికంటూ…

Read More »

error: Uh oh ...