నువ్వు బ్రాహ్మణుడివా? బ్రాహ్మణ బంధువువా???
అదేమిటి నేను పుట్టినది బ్రాహ్మణ పుట్టుక కదా నేను బ్రాహ్మణుడినె అని మనం అనవచ్చు. పరమాచార్యుల వారి ప్రకారం బ్రాహ్మణుడు అంటే ఎవరు? పీఠాదిపతుల ఆదేశం ప్రకారం ఎవరు బ్రాహ్మణుడు? అన్నది ఒకసారి చూద్దాం. బ్రాహ్మణ పుట్టుక పుట్టినంత మాత్రాన ఒకడు కర్మత: బ్రాహ్మణుడు అయిపోడు, కేవలం జన్మతః బ్రాహ్మణుడు. పరమాచార్య వారి ప్రకారం నేటి కాలంలో వారినే బ్రాహ్మణుడు అని పిలుస్తున్నాము. బ్రాహ్మణుడు అన్నవాడికి కొన్ని నియమాలు విధింపబడి ఉన్నాయి. అందులో అన్నింటికన్నా విశేషంగా చెప్పబడి ఉన్న విధి సంధ్యావందనం. సంధ్యావందనం చెయ్యని వాడు బ్రాహ్మణుడు అయితే వాడు అత్యధికంగా పాపం మూట కట్టుకుంటున్నాడు. ఒక మూడు తరాల వారు సంధ్యావందనం చెయ్యకపోతే వారిని ఇక బ్రాహ్మణుడు అని పిలవకూడదు. వాడు కేవలం బ్రాహ్మణ బంధువు గా నిలుస్తాడు…