నాడు – నేడు
గతంలో సంసారం ‘చీకట్లోనే’ జరిగేది, జీవితాలు వెలుగులో ఉండేవి, నేడు సంసారం వెలుగులోకి వచ్చి జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి, కప్పుకోవాల్సిన వాటిని చూపిస్తూ, చూపించాల్సిన అందమైన ముఖాన్ని కప్పేస్తున్నారు, నాడు కొందరే మందుకు, విందుకు, అలవాటు పడేవారు, నేడు కొందరే వీటికి దూరంగా ఉంటున్నారు, నాడు కష్టమొస్తే, కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పేవారు, నేడు కుటుంబం కుటుంబాలే కష్టాల కడలికి బలోతున్నాయి, నాడు తినడానికి శ్రమించి సంపాదించే వాళ్ళం, నేడు తిన్నది అరగడానికి తిన్నగా శ్రమిస్తున్నాం, నాడు జబ్బు చేస్తే శక్తి కోసం పండ్లు, పాలు తాగేవాళ్ళం, నేడు అదే డబ్బుతో బిళ్ళలు కొని, జబ్బులు ‘కొని’ తెచ్చుకుంటున్నాం, గతంలో అందరూ హార్డవేర్ ఇంజనీర్లే!! అయినా మనసు సాప్ట్ గా ఉండేది, ఇప్పుడు అంతా ‘సాప్ట్ వేర్ ఇంజనీర్లే’ మనసు…