అర్థం చేసుకోవడమంటే… ఇదే…
పందెం గెలిచిన గుర్రాన్ని అమ్మడానికి వేటగాడు సంతకు వెళ్ళాడు. బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు. గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు. బూట్లిచ్చేమో టోపి తీసుకున్నాడు. ..ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు. టోపి కాస్తా నదిలో పడింది. దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు. అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు. అయ్యోపాపం అని బాధపడ్డారు. “నీకివాల ఉపవాసమే” అన్నాడొకడు. పెళ్ళాంతో బడితపూజ ” తప్పదన్నాడింకోకడు.” నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు “అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు. బాటసారులిరువులు వేటగాడింటికి వెళ్ళారు. వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు. వాడి పెళ్ళాం ఎదురుగా…