
కవితా గీతిక
[Note that this is just a thought oriented poetry. Don’t draw analogy into my life. ]
[Note that this is just a thought oriented poetry. Don’t draw analogy into my life. ]
అనగనగా ఒక రోజు. రామోజీ ఫిల్మ్ సిటీలో “చీపురుతో కొడతా” అనే కుటుంబ కథా చిత్రం షూటింగ్ జరుగుతోంది. బోలెడు మంది జనం. అంతా హడావిడిగా ఉంది. డైరెక్టర్ దగ్గరకి ఒకతను కలుసుకోవడానికి వచ్చాడు. డైరెక్టర్ అతనితో తరవాత మాట్లాడుతా కూర్చోమని అన్నాడు. అతను ఒక పక్కగా కూర్చుని ఆ డైరెక్టర్ చేసే దర్శకత్వ ప్రతిభని చూడ సాగాడు. డైరెక్టర్ ఒకసారి స్క్రిప్టు తిరగేసి హీరో హీరోయిన్లతో ఇలా చెప్పాడు. “చూడండి! ఇప్పుడు మనం సాంగ్ షూట్ చేయబోతున్నాం. ఈ సాంగ్ చాలా కష్టపడి ప్లాన్ చేశాను. డాన్సు కూడా నేను అనుకున్నట్టు కుదిరితే ఈ సినిమాకి ఇదే పెద్ద హైలైట్ అవుతుంది. సాంగ్ ఈ పేపర్లో రాసాను. మీరు కూర్చుని నేర్చుకోండి. కోడ్యాన్సర్స్.. కోడ్యాన్సర్స్ ఏరయ్యా?”.. ఎవరినో అడిగాడు.…