కవితా గీతిక

గరుడ వాహనమెక్కి విష్ణువు
గిరుల కొలనున విడిచె మనిషిని
మనిషి వెదకెను మరో మనిషిని
మరిచిపోయెను మహా మనిషిని .౧

మెరుపు మెరిసెను మబ్బు కదిలెను
వాన కురిసెను వయసు పెరిగెను .౨

వ్యోమదేశము నుండి దిగెను
వ్యోమకాంతని ముచ్చటించెను
చంద్రుడే మరి చిన్నబోగా
చంచలమ్మున చిందులేసె

మనిషి చూసెను వ్యోమకాంతను
చూసినంతనె మనసు మారెను
కాంత కాంతిని వెంబడించె
వయో భ్రాంతిలో నింగికెగసె

పువ్వులిచ్చెను వెల్లివిరిసెను
మాటలిచ్చెను ప్రేమకురిసెను
పరితపించెను పరిధివలన
కదలదే మరి కాంత ఇంత .౫

వ్యోమకాంతకు అర్థమాయెను
మనిషి వదిలెను నిగ్రహమ్ము
ప్రేమనిచ్చిన మనసులోన
విషము ఉందని కలయజేసే

గురుతు తెలియని ప్రాణమంతా
మాట మాటతొ తీసివేసె
ప్రాణమంతా వదిలె మనిషి
మనిషి తనువును వదిలెనిపుడు

విష్ణువే మరి కదలి వచ్చి
వైష్ణవమ్మోపాలు అడిగె
ఏది ఏదని వెదకి చూసె
విడిచిపొమ్మని మనిషి విసిగె

మరల భువిన పడిన మనిషి
తిరిగి చూసెను కాంతకోసం
కాంతిలో మరి కాంతయేమో
మరో మనిషికి బంధువాయె

వైష్ణవమ్మోపాలు అడిగిన
విష్ణువేడని తిరిగి చూసె
ఇంతలో మరి మాయమయ్యే
అంతలో మరి భ్రాంతి ముగిసె .౧౦

జగత్తంతా తిరిగి వెదకె
విష్ణువేడని కలలు జూసె
గిరుల సిరులను అడిగె మనిషి
పవనవనముగ తిరిగె మనిషి

కడకు విష్ణువు చేరదీసె
ఏంటిరా అని మందలించె
భ్రాత అయి బహుసార్లు పలికె
శైవమును తను ప్రసాదించె

గురువు తానై నుడివె పలుకులు
తపస్సనెడి మహామంత్రము
జపము తపము చేసె మనిషి
చేరె తుదకు మహాపదము

ఇట్టి వాక్యము వైష్ణవమ్ము
ప్రబోధించే వాడు విష్ణువు
మనిషి తానై మారువరకు
వేచివుండును తుదకు కడకు

మారెనేమో మనిషి అనుకుని
ఆటతో మరి పరీక్షించి
గెలుపునెపుడు వదలకుండా
గురుతులే మరి మిగిల్చేను .౧౫

జయము జయము అట్టి వానికి
జయమునెపుడు కోరువానికి
జరుగు భువిలో మనోల్లాసము
జగత్తంతా జనోల్లాసము .౧౬

[Note that this is just a thought oriented poetry. Don’t draw analogy into my life. ]

error: Uh oh ...