Emma – Ad
0
0
సూచిక – ముందుమాట | భాగం – ౧ | భాగం – ౨ | భాగం – ౩ | భాగం – ౪ | భాగం – ౫* అగ్నికి ఉన్న ఈ తత్త్వం వల్లనే శాస్త్రవేత్తలు కొత్త వస్తువులను కనుగొనడం జరుగుతున్నది. అవి కొత్త వస్తువులు కావు. కేవలం కణముల మధ్య ప్రతిస్పందనను కలయికను అగ్ని వల్ల మార్పుచేయడం వల్ల ఏర్పడ్డ మరో కణ కూటము. ఇలా అగ్ని వల్ల ఏర్పడ్డ వస్తువుకు చలనశక్తి వివిధ మోతాదులలో ఉంటుంది. కొన్నింటికి చలన శక్తి చాలా ఎక్కువ ఉండి చలించి మరల చలనం లేని స్థితికి వస్తాయి. ఇంకొన్నిటికి చలనశక్తి చాలా తక్కువ ఉండి అవి కేవలం ఇంకొక వస్తు ప్రభావం వల్ల కాని వాటి ఆకర్షణ వికర్షణ శక్తుల వల్ల కాని సంభవిస్తాయి. ఈ చలనం ప్రాణుల వల్ల కూడా సంభవమే.…
సూచిక – ముందుమాట | భాగం – ౧ | భాగం – ౨ | భాగం – ౩ | భాగం – ౪* | భాగం – ౫ ఈ మార్పు జరిగే లక్షణం సమస్త పదార్థాల సృష్టికి మూలం. అణువులు కదులుట, పరివర్తనం చెందుట, ప్రతిస్పందించుట. వీటి వల్ల కొత్త పదార్థాలు పుడుతున్నయి. మరికొన్ని ప్రతిస్పందనల వల్ల తన లక్షణం కోల్పోయి ఇంకొక పదార్థం లో కలిసిపోతున్నాయి. అలా తయారయిన జీవులు కూడా ఈ లక్షణాలనే కనబరుస్తాయి. ముఖ్యంగా ఒక ప్రాణి తయారవాలంటే బోలెడన్ని అణువులు కావాలి కదా. కాబట్టి ఉన్న కణాలు పరివర్తనం చెంది ఒకటి రెండుగా, రెండు నాలుగుగా, నాలుగు ఎనిమిదిగా అలా గుణింపబడుతూ పురుష శరీరం లో అభివృద్ధి చెందుతాయి. ఇవి శక్తి కేంద్రాలు అంటే శక్తి వల్ల కదులుతాయి. ఈ కదిలిన కణాలు శరీరంలో చోటు…
సూచిక – ముందుమాట | భాగం – ౧ | భాగం – ౨ | భాగం – ౩* | భాగం – ౪ | భాగం – ౫ జీవాలు చాలా రూపాలలో ఉన్నయి. మానవులు, కోతులు, కుక్కలు, ఆవులు, సింహాలు, కోళ్లు, చీమలు, పురుగులు, పాములు, బల్లులు, చేపలు, పక్షులు మొదలయినవి. అన్నీ ఈ భూమి మీద ఉన్నయి. వీటిలాగే ఉండే వీటి పిల్లలు కూడా ఈ భూమి మీదే ఉంటాయి. “ఉన్నాయి” అన్న పదానికి అర్థం – వాటి శరీరాలు ఈ భూమి మీదే ఉన్నాయి. పుట్టినప్పుడు వాటి శరీరాలు ఈ భూమి ఆవరణలో కనిపించాయి. చనిపోయినప్పుడు వాటి శరీరాలు ఈ భూమి ఆవరణలోనే శుష్కించిపోతున్నయి. పుట్టినప్పుడు ఎక్కడ నుంచో వచ్చి, చచ్చినప్పుడు ఎక్కడికో పోవట్లేదు అని అర్థం అవుతోంది. ఇక్కడే పుట్టి, పెరిగి, జీవించి, చనిపోతున్నాయి. మరి ఏం…
సూచిక – ముందుమాట | భాగం – ౧ | భాగం – ౨* | భాగం – ౩ | భాగం – ౪ | భాగం – ౫ ఆ ఆసక్తి నుంచి కొన్ని విషయాలు తెలియ వచ్చాయి. కంటికి కనిపించని ఒక అదృశ్యమైన శక్తి ఇలా చేస్తోంది అని. వానలు పడటం, సూర్యోదయం, రాత్రి పగలు, పైకి ఎగరేసిన వస్తువు కింద పడటం, చెట్లు వాటి ఆకారాలు, ఈ భూమి, సముద్రం, కొండలు, నీళ్ళు, అగ్ని, ఆకలి, జీవాలు కదలడం, పెరగడం, అచేతనంగా పడిపోవడం, ఇవన్నీ ఆ శక్తి వల్ల జరుగుతున్నయి అని పూర్వకాలంలో ప్రాణులు నిర్ణయానికి వచ్చాయి. ఆ శక్తిని భగవంతుడు అని పిలవడం మొదలు పెట్టి ఉండవచ్చు. ఆ కాలంలోనే కాదు ఈ కాలంలో కూడా భగవంతుడు ఒక పట్టాన జీవుల ఊహకు అందలేదు. బహుశ అందుకేనేమో ఊహకు…
సూచిక – ముందుమాట | భాగం – ౧* | భాగం – ౨ | భాగం – ౩ | భాగం – ౪ | భాగం – ౫ మానవుడు ఒక్కడే భగవంతుడి గురించి తెలుసుకోగలడు. ఇతర ప్రాణులు తెలుసుకునే శక్తి కలిగిలేవు. ఇది చాలామంది అభిప్రాయం. మాట చెప్పలేని స్థితి ఇందుకు కారణం. తనలోని భావాలను ఇతర మానవులకు తెలియజేయాలని అనిపిస్తే, దానికి మాట్లాడటం అనే ప్రక్రియను గొప్ప సాధనంగా వాడతారు. ఇలాంటి ప్రక్రియనే అరుపుల రూపంలో, శబ్దాల రూపంలో, కదలికలరూపంతో చాలా జీవరాశులు దేస్తూనే ఉన్నయి. అంటే ఈ ప్రకృతిలో ఉన్న జీవాలు మానవుల్లా మాట్లాడినా మాట్లాడలేకపోయినా, భావవ్యక్తీకరణ చేస్తూనే ఉంటాయి. ఒక కుక్క మొరిగినట్లు అనిపించినా దాని భాషలో అది మాట్లాడుతోంది. అలాగే ఇతర ప్రాణులు, ఆఖరికి చీమలు, అంతకన్నా చిన్నగా ఉన్న ప్రాణులు వాటి భాషలలో అవి…
[Download this free e-book in PDF format] || అనంతమైన ప్రకృతికి పిత, విస్త్రుతమైన వాక్సంపదకు మూలము అయిన పరమేశ్వరునకు ఆలోచన సుమాంజలి || భగవంతుడు ఉన్నాడా, అలాంటి మూలశక్తి వ్యక్తరూపంలో ఉన్నదా అన్న ప్రశ్న చాలా సార్లు చాల మంది వేశారు. అనేకులు తమకు తోచిన రీతిలో సమాధానం ఇచ్చారు. ముఫ్ఫైయవ మానవ సంవత్సరపు ఆయుష్షు ఉన్న నేను ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తూ, ఈ ప్రకృతి ఏమిటి, ఎందుకు ఇలా ఉంది, ఇందులో భగవంతుడి ప్రమేయం ఎంత వరకు ఉండవచ్చు అని నా ఊహకు స్ఫురించినంతమేరకు వ్రాస్తున్న ఆలోచనా స్రవంతి. హిందూ సమాజంలో భగవచ్చింతన చాలా ఎక్కువ అనే చెప్పాలి. అయితే వచ్చిన సందేహం – “అది” ఉన్నదా? ఉంటే ఎలా ఉంటుంది?…